Sri Sathya Sai Trust For Universal Welfare

Blog

Sri Sathya Sai Trust for Universal Welfare

దసరా నవరాత్రి ఉత్సవాలు మరియు వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం బాబా వారి సన్నిధిలో

September 21, 2022

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ...
శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ యూనివర్సల్ వెల్ఫేర్, తాటిపూడి రిజర్వాయర్ సమీపంలోని శ్రీసాయి పల్లెలో...
"శ్రీ సత్యసాయి దివ్యామృతం" పవిత్ర ప్రాంగణంలో మొదటి శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది.
ఈ ఉత్సవాల యొక్క ముఖ్యాంశం "వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం" ఇందులో వేదపురుషుని దివ్య ఆశీర్వాదం కోసం ఏడు రోజుల పాటు వేద సూచనల ప్రకారం నిర్వహించడం జరుగుతుంది...


ఈ వేడుకలలో భాగంగా... ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం దైవిక సాంస్కృతిక కార్యక్రమాలు, హవనములు, హోమములు, వేదపారాయణం, దేవీ భాగవతంపై ఉపన్యాసాలు మొదలైన వాటితో సహా ప్రతిరోజూ ఆధ్యాత్మిక, ధార్మిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది...


ఇట్టి నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబరు 26 నుండి అక్టోబర్ 5 వరకు 10 రోజుల పాటు ఘనంగా నిర్వహించబడును...


ఇందులో భాగంగా...!!

శ్రీ సత్యసాయి దివ్యామ్రుతం చుట్టుపక్కల గల 9 గ్రామాల నివాసితులకు, స్వామి వారి ప్రసాదం అందజేయాలనే దివ్య సంకల్పంతో గ్రామసేవ అక్టోబర్ 1 మరియు అక్టోబర్ 2 తేదీలలో రెండు రోజుల పాటు నిర్వహించబడుతుంది...


విజయ దశమి రోజున, వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం యొక్క పూర్ణాహుతితో ముగుస్తాయి ...
మరియు శ్రీ సత్యసాయి దివ్యామృత పవిత్ర ప్రాంగణంలో - శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ ప్రారంభోత్సవంతో వేడుకల ముగింపు జరుగుతుంది...


ఇట్టి దివ్యమైన , భవ్యమైన, కార్యక్రమం సందర్భంగా, మా హృదయపూర్వకముగా ఆహ్వానాన్ని మీకు అందజేయడం మేము ఎంతో సంతోషిస్తున్నాము...
మరియు ఈ మహోత్సవాలలో పాల్గొని, అన్ని రోజులు దైవ ప్రసాదం స్వీకరించి, స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులు పొందాలని మా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము...!!!


ప్రేమ & కృతజ్ఞతతో
బృందం SSSTFUW

Contact Us

Main Menu

What We Do

Follow us on

723343
Total
Visitors

Copyrights © Sri Sathya Sai Trust for Universal Welfare All rights reserved